ఆ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వండి
29 Sep, 2020 16:55 IST
తాడేపల్లి: పంట, ఆస్తినష్టంపై త్వరగా అంచనాలు పంపించాలని కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వర్షాలు, పంట, ఆస్తినష్టం అంచనాలపై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడారు. కృష్ణా గుంటూరు, నెల్లూరు కలెక్టర్లతో మాట్లాడి వరదల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పంట, ఆస్తినష్టంపై త్వరగా అంచనాలు పంపించాలన్నారు. ఆర్‌బీకే లెవల్‌లో ఎన్యూమరేషన్ ఆఫ్ ఫార్మర్స్ డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు వరదల్లో 8 మంది చనిపోయినట్లు సమాచారం వచ్చిందని, వారి కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సూచించారు.