అంబేద్కర్ స్మృతివనం పనుల పురోగతిపై సీఎం సమీక్ష
9 Mar, 2023 13:20 IST
తాడేపల్లి: విజయవాడలో డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనుల పురోగతి, స్మృతివనం నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు మేరుగు నాగార్జున, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సీఎస్ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.