పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
17 Aug, 2023 12:44 IST
తాడేపల్లి: పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతులశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, పరిశ్రమలు వాణిజ్యశాఖ కార్యదర్శి యువరాజ్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్, ఫిషరీష్ కమిషనర్ కె.కన్నబాబు, వివిధ పోర్టుల ఉన్నతాధికారులు హాజరయ్యారు.