పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖపై సీఎం వైయస్.జగన్ సమీక్ష
31 Jul, 2023 12:57 IST
తాడేపల్లి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి, సర్వే ఆఫ్ విలేజెస్ ఆబాదీ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా(స్వామిత్వ) స్పెషల్ కమిషనర్ డాక్టర్ ఏ సిరి, సెర్ఫ్ సీఈఓ ఏ ఎం డి ఇంతియాజ్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ జె వెంకట మురళీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.