వైద్య, ఆరోగ్యశాఖలో ‘నాడు–నేడు’పై సీఎం సమీక్ష

22 Dec, 2020 13:18 IST

తాడేపల్లి: వైద్య, ఆరోగ్యశాఖలో ‘నాడు–నేడు’పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, నూతన బోధనాస్పత్రుల నిర్మాణం వంటి అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని,  వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ మల్లిఖార్జున, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.