వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
తాడేపల్లి: వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైయస్‌ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రులలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్‌ను సీఎం వైయస్ జగన్ పరిశీలించారు. ఆరోగ్యశ్రీలో మరింత సులువుగా వైద్య సేవలు పొందడం ఇలా అనే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం. టీ. కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈఓ వి. వినయ్ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి. మురళీధర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.