కోవిడ్-19 నివారణపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
25 Mar, 2020 14:09 IST

తాడేపల్లి: కోవిడ్-19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, ప్రభుత్వ సలహాదారులు అజేయ కల్లాం, సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సామాజిక దూరం పాటిస్తూ ఈ సమావేశం సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై సీఎం వైయస్ జగన్ అధికారులతో చర్చించారు. అలాగే లాక్‌డౌన్ అమలు తీరుపై ఆరా తీశారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని సూచించారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.