కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై సీఎం సమీక్ష
15 Jun, 2020 14:17 IST
తాడేపల్లి: కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష జరిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ కరికాల వల్లవన్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపుతున్న సంస్థల వివరాలను అధికారులు సీఎం వైయస్ జగన్‌కు వివరించారు. హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్‌ఆర్ స్టీల్ కంపెనీలతో జరిపిన చర్చల వివరాలను సైతం వివరించారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ఆయా సంస్థలు చేసిన ప్రతిపాదనలపై చర్చలు జరపాలని సూచించారు.