గృహనిర్మాణశాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
తాడేపల్లి: గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. వైయస్ఆర్ జగనన్న కాలనీలు, జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, ఓటీఎస్‌పై సీఎం సమీక్షిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎం. ఎం. నాయక్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ. నారాయణ భరత్ గుప్తా, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.