ఇళ్ల స్థలాలు, నిర్మాణంపై సీఎం సమీక్ష
27 Jan, 2021 12:34 IST
తాడేపల్లి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణంపై సీఎం సమీక్షిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమీక్షకు గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.