వైద్య ఆరోగ్యరంగంపై సీఎం సమీక్ష
18 Sep, 2019 11:41 IST
అమరావతి: వైద్య, ఆరోగ్య రంగంలో సంస్కరణకు సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్యఆరోగ్య కమిటీ చైర్మన్ సుజాతరావు, అధికారులతో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యరంగంలో సంస్కరణలకు సంబంధించి సీఎం వైయస్ జగన్‌కు సుజాతరావు కమిటీ నివేదిక అందించింది. నివేదిక అంశాలపై నిపుణుల కమిటీ, అధికారులతో సీఎం వైయస్ జగన్ చర్చిస్తున్నారు.