నేడు `గడప గడపకు మన ప్రభుత్వం`పై సీఎం సమీక్ష
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నేడు `గడప గడపకు మన ప్రభుత్వం`పై కీలక సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న తీరును సమీక్షించి.. మరింత మెరుగ్గా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా జగనన్న సురక్ష కార్యక్రమంపైనా సీఎం వైయస్ జగన్ చర్చించనున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం తీసుకురానుంది. జూన్ 23వ తేదీ నుంచి జూలై 23వ తేదీ వరకు జగనన్న సురక్షా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.