వ్యవసాయ శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
తాడేపల్లి: వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్‌ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్టారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయం, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూదన్‌రెడ్డి, పుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి ఎం. కె. మీనా, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎండీ పీఎస్. ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్ కె. కన్నబాబు, ఏపీడీడీసీఎఫ్ డైరెక్టర్ డాక్టర్ ఎ బాబు, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.