కోవిడ్ నివారణ చర్యలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
28 Jul, 2021 11:47 IST
తాడేపల్లి: కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై, థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.