ఏ ఒక్క రైతుకు పరిహారం అందలేదన్న మాట రాకూడదు
4 May, 2023 11:52 IST
అమరావతి: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాట రాకూడదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వర్షాలు అనంతర పరిస్థితులపై సీఎంఓ అధికారులతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
- వర్షాల కారణంగా పంట నష్టం తదితర అంశాలపై ప్రాథమికంగా అందిన వివరాలను సీఎంకు వివరించిన అధికారుల.
- రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని సీఎం ఆదేశం.
- అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాట రాకూడదన్న సీఎం.
- వర్షాల వల్ల రైతులకు కలిగిన పంట సహా ఇతర నష్టాలకు గ్రామ సచివాలయాల స్థాయి నుంచే నిరంతరం వివరాలు తెప్పించుకోవాలన్న సీఎం.
- రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఇది పూర్తిస్థాయిలో జరగాలని సీఎం ఆదేశాలు.
- ఎన్యుమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీకోసం పెట్టాలన్న సీఎం.
- ఎవరైనా మిగిలిపోయినా… వెంటనే అధికారుల దృష్టికి తీసుకు వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందన్న సీఎం.
- పంట నష్టపోయిన ఏ రైతుకు కూడా పరిహారం అందలేదనే మాట రాకూడదన్న సీఎం.
- రబీ సీజన్‌కు ధాన్యం కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్న సీఎం.
- పంట కొనుగోలు చేయడం లేదన్న మాట కూడా ఎక్కడా వినిపించకూడదన్న సీఎం.
- రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే… ఫిర్యాదులు ఉంటే.. వాటిని నివేదించడానికి ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేయాలన్న సీఎం.
- ఈఫిర్యాదులపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
- రైతుల ముఖంలో చిరునవ్వు కనిపించేలా అధికారులు చర్యలు ఉండాలని స్పష్టంచేసిన సీఎం.