పేదల సంక్షేమానికి మనం యజ్ఞం చేస్తున్నాం

31 Dec, 2020 14:22 IST

తాడేపల్లి: అర్హత ఉండి ఇంటి పట్టా రాలేదనే మాట వినిపించకూడదు అని  సీఎం కార్యాలయ అధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతోసీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘పేదల సంక్షేమం కోసం మనం యజ్ఞం చేస్తున్నాం. అర్హులకు పథకాలన్నీ అందాల్సిందే. పెన్షన్, బియ్యం కార్డు, ఇంటి పట్టాలకు సంబంధించి సచివాలయాల్లో పెండింగ్‌ దరఖాస్తులు ఉండకూడదు. అర్హులైన వారికి 10 రోజుల్లో పెన్షన్, బియ్యం కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇంటి పట్టా ఇవ్వాలి. ఎన్ని రోజుల్లో అందిస్తామనే విషయాన్ని తెలిపేలా సచివాలయాల్లో బోర్డు ఏర్పాటు చేయాలి. అమ్మఒడి పథకానికి అధికారులు సిద్ధం కావాలి’ అని సీఎం ఆదేశించారు.