ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
20 Dec, 2023 17:16 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటక, సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి ఆర్ కే రోజా, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, క్రీడాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రద్యుమ్న, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి. కోటేశ్వరరావు, శాప్ వీసీ అండ్ ఎండీ హెచ్ ఎం ధ్యానచంద్ర, అంతర్జాతీయ క్రీడాకారులు అంబటి రాయుడు, పీ వీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాకేత్ మైనేని, వి జ్యోతి సురేఖ, ఎస్‌కె జఫ్రీన్‌లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.