పశుసంవర్ధ‌క, మత్స్య శాఖలపై సీఎం సమీక్ష

22 Mar, 2021 15:36 IST

తాడేపల్లి: పశుసంవవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న  ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, వ్యవసాయ, పాడిపరిశ్రామభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఏపీ డెయిరీ డవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఎండీ బాబు ఎ, మత్స్యశాఖ కమిషనర్‌ కె కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.