వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై సీఎం సమీక్ష
8 Aug, 2022 13:20 IST
తాడేపల్లి: వ్యవసాయ శాఖ, పౌరసరఫరాలశాఖలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, సివిల్ సప్లయిస్ కమిషనర్ గిరిజా శంకర్, వ్యవసాయ శాఖ కమిషనర్ సి. హరికిరణ్, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ వీరపాండ్యన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.