వ్యవసాయం, అనుబంధ శాఖలపై సీఎం సమీక్ష
6 Apr, 2021 14:29 IST
తాడేపల్లి: వ్యవసాయం, అనుబంధ శాఖలు (హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, అగ్రి ఇన్‌ఫ్రా)పై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్, ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్ కె. కన్నబాబు, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై మధుసూదనరెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ ఎస్‌ఎస్ శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.