అగ్రి ఫండ్ ప్రాజెక్టుపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
1 Jun, 2021 13:17 IST
తాడేపల్లి: అగ్రి ఫండ్ ప్రాజెక్టులు, మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాల (ఎంపీఎఫ్‌సీ)పై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి, మార్కెటింగ్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, ఏపీడీడీసీ డైరెక్టర్ అహ్మద్‌బాబు, వ్యవసాయ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, ఉద్యానవన కమిషనర్ ఎఫ్‌ఎస్ శ్రీధర్‌తో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.