వ్యవసాయ మిషన్‌పై సీఎం వైయస్ జగన్ సమీక్ష
6 Feb, 2020 15:06 IST
తాడేపల్లి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మిషన్ పై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పంటలు, వాటికి లభిస్తున్న ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం ఎలా వస్తుందని అధికారులను సీఎం ప్రశ్నించారు. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్‌పై సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలి. ఇప్పుడున్న వ్యవస్థ ఎలా నడుస్తుందో పరిశీలించండి. ప్రత్యామ్నాయ విధానం కూడా ఉండాలని స్పష్టం చేసిన సీఎం. పంటల ధరలను స్థిరీకరించడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్లాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌పై ఒక సెల్‌ను ఏర్పాటు చేయాలి. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చర్చించారు.