భారీవర్షాలపై కలెక్టర్లతో సీఎం వైయస్ జగన్ సమీక్ష
18 Nov, 2021 11:02 IST
అమరావతి: భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌సమీక్ష నిర్వహించారు. తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. రిజర్వాయర్లు, చెరువులు, నీటినరుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అంననా వేస్తూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆహారం, మందులు సిద్ధంచేసుకోవాలన్నారు.