బీసీలకు 52 కార్పొరేషన్లు
తాడేపల్లి: కొత్తవాటితో కలుపుకొని మొత్తంగా బీసీలకు 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ పరిధిలోని వివిధ కార్పొరేషన్ల ఏర్పాటుపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.బీసీపరిధిలోని వివిధ ఉపకులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై సీఎం చర్చించారు.ఈ నెలాఖరుకల్లా బీసీకార్పొరేషన్ల చైర్మన్‌లు, డైరెక్టర్ల పోస్టులు భర్తీ చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా ? అన్నది కార్పొరేషన్లు పర్యవేక్షించాలన్నారు. ఇప్పటివరకు రెండు కోట్ల 12 లక్షల 40 వేల 810 మంది బీసీలకు రూ.22,685.74 కోట్లను నగదు బదిలీ ద్వారా అందించామని సీఎం చెప్పారు.లంచాలు, వివక్ష లేకుండా తలుపు తట్టి మరీ పథకాలు అందిస్తున్నామన్నారు. గతంలో 69 కులాలకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇప్పుడు మొత్తం బీసీ కులాలన్నింటికీ కార్పొరేషన్లలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.