విశాఖ రాజధానిపై నేడు సీఎం వైయస్ జగన్ సమీక్ష
31 Oct, 2023 10:34 IST
తాడేపల్లి: విశాఖపట్నం రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్ష జరగనుంది.
ఏపీకి అతిత్వరలో పాలనా రాజధాని వైజాగ్ కానుంది. ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి సంబంధించిన పనులు పూర్తి కావొచ్చాయి. అలాగే.. అక్కడ ఉన్నతాధికారులకు తాత్కాలిక వసతి కేటాయింపులపై అధికారులతో సీఎం వైయస్ జగన్ ఇవాళ్టి సమీక్షలో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్రీమెన్ కమిటీ, ఆయనకు సమర్పించనుంది.