డిసెంబర్ నాటికి మరో 70,719 మందికి మేకలు, గొర్రెలు
తాడేపల్లి: డిసెంబర్ నాటికి మరో 70,719 మందికి మేకలు, గొర్రెలు పంపిణీ చేయాలని సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గురువారం వైయస్ఆర్ ఆసరా, చేయూత, జగనన్న తోడుపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రతి నెలా 5 వేల మందికి మేకలు, గొర్రెలు అందజేత. జగనన్న తోడు పథకం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు వెంటనే రుణాలు మంజూరు అయ్యేలా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లదేనని సీఎం ఆదేశించారు. వాలంటీర్లకు సత్కారంపైనా సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అర్హత ప్రకారం మూడు కేటగిరీలుగా వాలంటీర్ల ఎంపిక. లెవల్ 1లో ఏడాది పాటు సేవలందించిన వాలంటీర్ల పేర్లు పరిశీలన. వీరికి సేవా మిత్రతో పాటు బ్యాడ్జి, రూ.10 వేలు. లెవల్2లో ప్రతి మండలం లేదా పట్టణంలో ఐదుగురు చొప్పున ఎంపిక. వీరికి సేవా రత్నతో పాటు స్పెషల్ బ్యాడ్జి, రూ.20 వేలు. లెవల్ 3లొ ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున ఎంపిక. వీరికి సేవా వజ్రాల పేరిట స్పెషల్ బ్యాడ్జితో పాటు మెడల్, రూ.30 వేలు అందజేయాలని అధికారులకు సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.