డిజిటల్ విద్యపై అవగాహనకు తరగతులు
21 Jul, 2020 18:41 IST
తాడేపల్లి: డిజిటల్ విద్య, డీవైజ్‌లపై అవగాహనకు తరగతులు నిర్వహించాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, జగనన్న గోరుముద్ద పథకాలపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్య పరిధిలోకి పీపీ-1 పీపీ-2ప్రతిపాదనలపై చర్చించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈ లాంటి పోటీ పరీక్షలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు.