లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి
26 Nov, 2019 17:23 IST
సచివాలయం: వైయస్‌ఆర్ నవశకంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. సచివాలయంలో సీఎం వైయస్ జగన్ కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్ నవశకంపై సీఎం వైయస్ జగన్ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. డిసెంబర్ 15వ తేదీ వరకు గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తికావాలని, డిసెంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు గ్రామ సచివాలయాల్లో జాబితాలను ఉంచాలని సూచించారు. అభ్యంతరాలు పరిశీలించి డిసెంబర్ 20 నాటికి తుది జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు.