అక్టోబర్ 15 నుంచి వైయస్ఆర్ రైతు భరోసా
25 Sep, 2019 12:46 IST
అమరావతి: అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సదస్సు ప్రారంభమైంది. సదస్సులో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. సమావేశంలో కౌలు రైతులకు రుణాల పెండింగ్, వవైయస్ఆర్ రైతు భరోసా అమలుపై చర్చిస్తున్నారు.