ఎన్నికల్లో గెలిచిన పార్టీలకు సీఎం వైయస్ జగన్ అభినందనలు
4 Dec, 2023 10:44 IST
తాడేపల్లి: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో గెలిచిన పార్టీలకు అభినందనలు తెలియజేశారు.
మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గడ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి, మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్‌కు సీఎం వైయస్ జగన్ అభినందనలు తెలిపారు.