యడ్లపల్లి చేరుకున్న సీఎం వైయస్ జగన్
21 Dec, 2022 11:38 IST
బాపట్ల: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం వైయస్ జగన్ కొద్దిసేపటి క్రితమే యడ్లపల్లి గ్రామానికి చేరుకున్నారు. సీఎం వైయస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మరికొద్ది సేపట్లో యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి విద్యార్ధులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం, బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.