జీఐఎస్ ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్
3 Mar, 2023 10:20 IST
తాడేపల్లి: విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 (జీఐఎస్ ) ప్రాంగణానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. దారిపోడవునా సీఎం వైయస్ జగన్‌కు విశాఖవాసులు ఆత్మీయ స్వాగతం పలికారు. జీఐఎస్ ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. జీఐఎస్ సమ్మిట్‌కు దిగ్గజ పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.