పల్నాడు జిల్లాకు చేరుకున్న సీఎం వైయస్ జగన్
6 Apr, 2023 10:40 IST
పల్నాడు జిల్లా: సామాన్యుల ఆరోగ్యవరప్రదాయని ఫ్యామిలీ డాక్టర్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చేరుకున్నారు. ఫ్యామిలీ ఫిజిషిషన్ కాన్సెప్ట్ స్టాళ్లను, డాక్టర్ వైయస్ఆర్ విలేజ్ హెల్త్ సెంటర్‌ను సీఎం వైయస్ జగన్ పరిశీలించారు. స్టాళ్ల గురించి వైద్య సిబ్బంది సీఎం వైయస్ జగన్‌కు వివరిస్తున్నారు. అదే విధంగా 104 వాహనంలో వైద్య సేవల కోసం ఏర్పాటు చేసిన వసతులను పరిశీలిస్తున్నారు. మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రారంభించనున్నారు.