మార్కాపురం చేరుకున్న సీఎం వైయస్ జగన్
12 Apr, 2023 11:06 IST
ప్రకాశం జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం చేరుకున్నారు. హెలీప్యాడ్ వద్ద సీఎం వైయస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో వైయస్‌ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొని, అగ్రవర్ణ పేద అక్కచెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అదే విధంగా మార్కాపురం అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.