కొమరగిరి చేరుకున్నసీఎం వైయస్ జగన్
25 Dec, 2020 13:35 IST
తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామం చేరుకున్నారు. పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం కడప విమానాశ్రయం నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైయస్ జగన్.. హెలికాప్టర్‌లో యు.కొత్తపల్లి మండలం కొమరగిరి బయల్దేరారు. కొద్ది సేపటి క్రితమే కొమరగిరి గ్రామం చేరుకున్న సీఎం వైయస్ జగన్.. కాసేపట్లో ఇళ్ల పట్టాల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టడంతో పాటు.. ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ప్రతిష్టాత్మక పథకానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు.