భోగాపురం చేరుకున్న సీఎం వైయస్ జగన్
విజయనగరం: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భోగాపురం చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్ కొద్దిసేపటి క్రితమే భోగాపురం చేరుకున్నారు. సీఎం వైయస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో జీఎంఆర్ విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ దీన్ని నిర్మిస్తోంది. అదే విధంగా విశాఖలో రూ.21.844 కోట్లతో అదానీ గ్రూప్ నిర్మించే వైజాగ్ టెక్‌పార్కు లిమిటెడ్‌కు సీఎం వైయస్ జగన్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా తారకరామ తీర్థసాగరం పనులకు రూ.194.40 కోట్లతో శంకుస్థాపన చేయనున్నారు. రూ.23.73 కోట్లతో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.