విశాఖ చేరుకున్న సీఎం వైయస్ జగన్
2 Mar, 2023 17:21 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు బయల్దేరిన సీఎం.. కొద్దిసేపటి క్రితమే విశాఖకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్టులో సీఎం వైయస్ జగన్కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, వైయస్ఆర్ సీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. నేటి నుంచి మరో రెండు రోజుల పాటు సీఎం వైయస్ జగన్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు. పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. 4వ తేదీ మధ్యాహ్నం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ముగిసిన అనంతరం విశాఖ నుంచి బయల్దేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.