పోలవరం చేరుకున్న సీఎం వైయస్ జగన్
19 Jul, 2021 11:36 IST
పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం చేరుకున్నారు. సీఎం వైయస్ జగన్‌తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. ముందుగా సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు. అధికారులతో కలిసి సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా మధ్యాహ్నం అధికారులతో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. గడువులోగా పోలవరం పనులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.