సీఎం వైయస్‌ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

8 May, 2020 13:08 IST

నెల్లూరు: వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకం ద్వారా తమకు ఆర్థిక సాయం అందించారని, తమ కుటుంబాల్లో ఆత్మ స్థయిర్యం నింపారంటూ సీఎం వైయస్‌ జగన్ పై నెల్లూరు జిల్లా మత్స్యకార కుటుంబాలు ప్రశంసలు కురిపించాయి. ఈ సందర్భంగా  కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట సముద్రతీరంలో సీఎం వైయస్‌ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సముద్రతీరం వద్దే మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు చర్యలు చేపట్టారని, అందుకు వారికి రుణపడి ఉంటామని అన్నారు.