భగత్‌సింగ్‌కు సీఎం వైయస్ జగన్ ఘన నివాళులు
23 Mar, 2022 16:33 IST
అమరావతి: అమరవీరుల దినోత్సవం సందర్భంగా శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భగత్‌సింగ్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, మంత్రి తానేటి వనిత, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.