మహానేత వైయస్ఆర్‌కు సీఎం వైయస్ జగన్ ఘన నివాళి
2 Sep, 2022 09:36 IST
వైయస్‌ఆర్ జిల్లా: ప్రజల మనిషి, దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళులర్పించారు. వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్‌కు చేరుకున్న సీఎం వైయస్ జగన్, కుటుంబ సభ్యులు మహానేత వైయస్ఆర్ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. దివంగత మహానేత సతీమణి వైయస్ విజయమ్మ, వైయస్ భారతి, కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.