మహానేతకు సీఎం వైయస్ జగన్ నివాళి
24 Dec, 2021 11:03 IST
వైయస్ఆర్ జిల్లా: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈరోజు ఉదయం ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న సీఎం వైయస్ జగన్.. మహానేత వైయస్ఆర్‌కు ఘన నివాళులర్పించారు. సీఎం వైయస్ జగన్ వెంట మంత్రులు అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పలరాజు, ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి ఉన్నారు. అంతకు ముందు వైయస్ఆర్ ఘాట్ వద్ద మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి వైయస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నివాళులర్పించారు.