ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవి
25 Sep, 2021 14:25 IST
తాడేపల్లి: సుప్రసిద్ధ గాయకులు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఘన నివాళులర్పించారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ‘మధుర గాయకులు, స్వరకర్త ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి. తన గాత్రంతో తెలుగు వారినే కాదు ఎన్నో భాషల్లో అశేష సంగీతాభిమానులను సంపాదించుకున్న ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా వుంటారు’ అని ట్వీట్ చేశారు.