బాబు జగ్జీవన్ రామ్ బాట ఆచరణీయం
6 Jul, 2021 19:29 IST
తాడేపల్లి: జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సీఎం వైయస్ జగన్ నివాళులు అర్పించారు. ‘జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం. ఆయన బాట ఆచరణీయం. నేడు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’ అని సీఎం వైయస్ జగన్ ట్వీటర్‌లో పేర్కొన్నారు.