`మిస్సైల్ మ్యాన్`కి సీఎం వైయస్ జగన్ నివాళి
15 Oct, 2020 10:48 IST
తాడేపల్లి: మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం కోట్లాదిమందికి స్ఫూర్తిదాయకం. మిస్సైల్ మ్యాన్‌గా, ప్రజల ప్రెసిడెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ట్వీట్ చేశారు.