విజయకాంత్ మృతిపై సీఎం వైయస్ జగన్ సంతాపం
28 Dec, 2023 13:59 IST
తాడేపల్లి: ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక సంతాప ప్రకటన విడుదల చేసింది.
విజయకాంత్ కుటుంబసభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని సదరు ప్రకటనలో సీఎం వైయస్ జగన్ తెలిపారు.