పింగ‌ళి వెంక‌య్య‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

2 Aug, 2023 14:14 IST

తాడేప‌ల్లి: స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు, జాతీయ ప‌తాక రూప‌క‌ర్త పింగ‌ళి వెంక‌య్య జ‌యంతి సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆ మ‌హ‌నీయునికి నివాళుల‌ర్పిస్తూ ట్వీట్ చేశారు. `అతి చిన్న వయస్సులోనే స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని దేశం కోసం పోరాడిన మహనీయులు పింగళి వెంకయ్య గారు. జాతీయ పతాక రూపకర్తగా, స్వాతంత్ర్య సమర యోధుడిగా ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు` అర్పిస్తూ సీఎం ట్వీట్ చేశారు.