మహానేతకు సీఎం వైయస్ జగన్ నివాళి
11 Jan, 2021 12:29 IST
నెల్లూరు: ‘జగనన్న అమ్మ ఒడి’ రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకు ముందు శ్రీవేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం... దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాసేపట్లో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం వైయస్ జగన్.. తన ప్రసంగం అనంతరం ‘అమ్మ ఒడి’ రెండో విడత చెల్లింపులను ప్రారంభిస్తారు. 44,48,865 మంది తల్లులకు బ్యాంక్ ఖాతాల్లో రూ.15 వేల చొప్పున.. రూ.6,673 కోట్ల నగదు బదిలీ ప్రక్రియను సీఎం ప్రారంభిస్తారు.