మహానేతకు సీఎం వైయస్ జగన్ నివాళి
25 Dec, 2020 14:09 IST
తూర్పుగోదావరి: యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ, వైయస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమ బహిరంగ సభా వేదికకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. ముందుగా నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ సభా వేదికపైకి చేరుకొని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభించారు.