నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం వైయస్ జగన్
27 May, 2023 10:52 IST
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, లెఫ్లినెంట్ గవర్నర్లు హాజరయ్యారు.